Share News

IPL 2025 DC vs RCB: ఢిల్లీలో సూపర్ ఫైట్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:54 PM

పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, మూడో ప్లేస్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది.

IPL 2025 DC vs RCB: ఢిల్లీలో సూపర్ ఫైట్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
RCB vs DC

ఐపీఎల్‌ (IPL 2025)లో మరో సూపర్ ఫైట్‌కు రంగం సిద్ధమవుతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, మూడో ప్లేస్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో తలపడబోతున్నాయి (DC vs RCB). ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. దీంతో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, రజత్ పటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సర్వ శక్తులు ఒడ్డి పోరాడబోతున్నాయి.


గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఢిల్లీ ఓపెనర్ డుప్లెసిస్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం. డుప్లిసిస్ రాకతో ఢిల్లీ బ్యాటింగ్ మరింత బలంగా మారుతుంది. అలాగే కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్‌తో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉంది. అలాగే మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్, ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో తమ సత్తా చాటుతూ జట్టును గెలిపిస్తున్నారు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా అంతే బలంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది.


విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కళ్‌తో కూడిన టాపార్డర్ సమయోచితంగా రాణిస్తోంది. మిడిలార్డర్‌లో రజత్ పటిదార్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్ వేగంగా పరుగులు చేయగలుగుతున్నారు. అలాగే బౌలింగ్‌లో హాజెల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ చక్కగా రాణిస్తున్నారు. వీరికి కృనాల్ పాండ్యా, యశ్ దయాల్ నుంచి సహకారం లభిస్తోంది.


తుది జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (అంచనా): డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కళ్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, హాజెల్‌వుడ్, యశ్ దయాల్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2025 | 04:54 PM