IPL 2025 DC vs KKR: సునీల్ నరైన్ మాయాజాలం.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ విజయం
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:24 PM
చాలా రోజుల తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ ఓ విజయం అందుకుంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సత్తా చాటి ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
చాలా రోజుల తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ ఓ విజయం అందుకుంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సత్తా చాటి ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. 14 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మొదట కోల్‌కతా బ్యాటర్లు సమష్టిగా రాణించి భారీ స్కోరు సాధించారు. అనంతరం బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతోంది (KKR VS DC). మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు భారీ టార్గెట్ ఉంచింది.

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు గుర్భాజ్ (26), సునీల్ నరైన్ (27) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. గుర్భాజ్ అవుటైన తర్వాత వచ్చిన రహానే (26) కూడా తన వంతు పరుగులు చేశాడు. ఆ తర్వాత రఘవంశీ (44), రింకూ సింగ్ (36) కీలక భాగస్వామ్యం నెలకొల్పి కేకేఆర్ భారీ స్కోరుకు బాటలు వేశారు. చివర్లో ఆండ్రూ రస్సెల్ (17) కీలక పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీశారు. ఛమీరా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
205 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి మంచి ఆరంభం దక్కలేదు. అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ త్వరగానే అవుటయ్యారు. అయితే డుప్లెసిస్ (62), అక్షర్ పటేల్ (43) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీని తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుట్ కావడం ఢిల్లీ ఓటమికి కారణమైంది. చివర్లో విప్రాజ్ నిగమ్ (38) పోరాడినా ఫలితం లేకపోయింది. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ (3/29) ఢిల్లీ పతనాన్ని శాసించాడు. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..