IPL 2025 DC vs GT: కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - May 18 , 2025 | 09:24 PM
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (112 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించిన రాహుల్ గుజరాత్ బౌలర్లకు చుక్కల చూపించాడు.
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (112 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించిన రాహుల్ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. గుజరాత్ ముందు భారీ స్కోరు ఉంచింది.
టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. డుప్లెసిస్ (5) త్వరగానే ఔటైనా మిగిలిన బ్యాటర్లు సమయోచితంగా రాణించారు. సెంచరీ చేసిన రాహుల్‌తో అభిషేక్ పోరెల్ (30), అక్షర్ పటేల్ (25) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (21) కూడా వేగంగా పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
గుజరాత్ ముందు 200 పరుగులు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, అర్షద్ ఖాన్, సాయి కిశోర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మరి, 200 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ ఛేదించగలిగితే ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. మరి, గుజరాత్ బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..