IPL 2025 CSK vs RR: ఓల్డ్ vs యంగ్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
ABN , Publish Date - May 20 , 2025 | 05:35 PM
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగుకు వెళ్తుంది. ఈ ఇరు జట్లు ఇప్పటికే తాజా టోర్నీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న రెండు జట్లు పరువు నిలబెట్టుకునేందుకు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి అభిమానులకు కాస్తైనా సంతోషం అందించాలనుకుంటున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి (RR vs CSK). ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగుకు వెళ్తుంది. ఈ ఇరు జట్లు ఇప్పటికే తాజా టోర్నీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి (IPL 2025).

టోర్నీ ఆరంభం నుంచి చెన్నై టీమ్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. నిజానికి చెన్నై టీమ్‌ను చూస్తుంటే అది టీ-20 జట్టులా కనిపించదు. పూర్తిగా సీనియర్లతో నిండిపోయింది. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ విఫలమై వరుస పరాజయాలను మూటగట్టుకుంది. ఇప్పటికీ 43 ఏళ్ల ధోనీ (MS Dhoni)పైనే ఆధారపడాల్సి వస్తోందంటే ఆ జట్టు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రాణిస్తారనుకున్న రచిన్ రవీంద్ర, డ్వాన్ కాన్వే, సామ్ కర్రన్ విఫలమయ్యారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరమయ్యాడు. జడేజా, ధోనీ, శివమ్ దూబే పైనే జట్టు ఆధారపడుతోంది.
చెన్నైతో పోల్చుకుంటే రాజస్తాన్ రాయల్స్‌ది విచిత్రమైన పరిస్థితి. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ వంటి ట్యాలెంటెడ్ కుర్రాళ్లతో నిండిన జట్టు. ఈ కుర్రాళ్లు ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోలేక విఫలమయ్యారు. ఛేజింగ్ సమయాల్లో కావాల్సిన పరిణితి వీరికి లోపించింది. ఎన్నో మ్యాచ్‌ల్లో చివరి వరకు వచ్చి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ రోజు ఢిల్లీలో బరిలోకి దిగుతున్నాయి.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ (అంచనా): డెవాన్ కాన్వే, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, జడేజా, బ్రేవిస్, శివమ్ దూబే, ధోనీ, అశ్విన్, పతిరణ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్
రాజస్తాన్ రాయల్స్ (అంచనా): వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మేయర్, హసరంగా, దేశ్‌పాండే, ఆకాష్ మద్వాల్, మఫాకా, ఫరూఖీ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..