IPL 2025: ఐపీఎల్ మ్యాచ్‌లు ఆ మూడు నగరాల్లోనే జరుగుతాయా
ABN , Publish Date - May 10 , 2025 | 06:06 PM
ఐపీఎల్ మ్యాచ్‌లను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల తర్వాత నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. తాజా సీజన్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ మ్యాచ్‌లను దక్షిణాది నగరాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్‌లను బీసీసీఐ (BCCI) నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల తర్వాత నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. తాజా సీజన్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ మ్యాచ్‌లను దక్షిణాది నగరాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఉత్తర భారతంలోనూ, పశ్చిమ భారతంలోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆయా ప్రాంతాల్లోని నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడం ఇప్పట్లో కుదరదు. అందుకే సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఉన్న దక్షిణ భారత నగరాల్లో మిగిలిన అన్ని మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటోందట. భారత ప్రభుత్వం అనుమతిస్తే దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో మిగిలిన 16 మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటోందట.
ఒకవేళ ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనా విదేశీ ఆటగాళ్లు పాల్గొనడం అనుమానంగా ఉంది. ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు, కోచ్‌లు సహాయక సిబ్బంది తమ తమ స్వస్థలాలకు పయనమయ్యారు. కొందరు తమ దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనా వారు తిరిగి వచ్చేది అనుమానాస్పదంగానే ఉంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..