Share News

Raghu Prasad Hockey Umpire: హాకీ అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ రఘు

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:13 AM

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) 2025కు గాను పురుష ‘అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు భారత్‌కు చెందిన రఘు ప్రసాద్‌కు దక్కింది. 2003లో అంపైర్‌గా కెరీర్‌ ఆరంభించిన ప్రసాద్‌...

Raghu Prasad Hockey Umpire: హాకీ అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ రఘు

లాసన్నే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) 2025కు గాను పురుష ‘అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు భారత్‌కు చెందిన రఘు ప్రసాద్‌కు దక్కింది. 2003లో అంపైర్‌గా కెరీర్‌ ఆరంభించిన ప్రసాద్‌ (కర్ణాటక).. గడచిన 23 ఏళ్లలో 198 మ్యాచ్‌లకు రెఫరీగా పని చేశాడు. ఈ నెల 23 నుంచి జరగనున్న సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌తో 200 మ్యాచ్‌ల మైలురాయిని అందుకొన్న తొలి ఆసియా అంపైర్‌గా అరుదైన ఘనతను సాధించనున్నాడు. హాకీ వరల్డ్‌క్‌పలు, మూడు ఒలింపిక్స్‌, ఆసియా క్రీడల్లో రెఫరీగా రఘు సేవలందించాడు. కాగా ఈ ఏడాదికిగాను అత్యుత్తమ మహిళా అంపైర్‌గా అర్జెంటీనాకు చెందిన ఇరెనె ప్రెసెన్‌క్వీ ఎంపికైంది.

ఇవి కూడా చదవండి:

IND VS BAN Women’s Series: భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌‌పై కీలక అప్ డేట్

NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2025 | 05:13 AM