Share News

Oval Test Win: గ్రేటెస్ట్‌ విన్‌

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:09 AM

నవ యువ భారత జట్టు అద్భుతం చేసింది. అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్‌, అశ్విన్‌లేని లోటును పూరించింది. ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలిపే సత్తా తమకుందని నిరూపించింది. చారిత్రక ఐదో టెస్టు...

Oval Test Win: గ్రేటెస్ట్‌ విన్‌

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

నవ యువ భారత జట్టు అద్భుతం చేసింది. అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్‌, అశ్విన్‌లేని లోటును పూరించింది. ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలిపే సత్తా తమకుందని నిరూపించింది. చారిత్రక ఐదో టెస్టు విజయానికి..మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టును అమోఘ రీతిలో డ్రా చేసుకోవడం స్ఫూర్తిగా నిలిచింది. ఆ టెస్టు స్ఫూర్తితో ‘ఓవల్‌’లో గెలుపు సాధించగలమన్న ధీమా గిల్‌ సేనలో ఏర్పడింది. అయితే ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు తడబాటుకు లోనైనా..పేసర్లు సిరాజ్‌, ప్రసిద్ధ్‌ తడాఖా చూపడంతో భారీ స్కోరు చేయకుండా ఇంగ్లండ్‌ను నిలువరించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు చెలరేగడంతో మనోళ్లు దాదాపు 400కు చేరువగా వచ్చారు. కానీ బ్యాటింగ్‌కు అనుకూలించిన వికెట్‌పై 374 పరుగుల లక్ష్యం ఆతిథ్య జట్టుకు సులువేవనని అనిపించింది. పైగా రూట్‌, బ్రూక్‌ శతకాలతో కదం తొక్కడంతో భారత్‌ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మన యువకుల పట్టు సడలుతుందేమోనని అనిపించింది. బ్రూక్‌ ఇచ్చిన క్యాచ్‌ను సిరాజ్‌ జారవిడవడంతో మ్యాచ్‌ చేజారినట్టేనని అభిమానులు డీలా పడ్డారు. కానీ టీమిండియా మాంచెస్టర్‌లో కంటే మిన్నగా పోరాడింది.ఈ ఊపులో బ్రూక్‌, రూట్‌ను పెవిలియన్‌ చేర్చి మ్యాచ్‌పై పట్టు సాధించారు. కానీ స్మిత్‌ క్రీజులో ఉండడంతోపాటు ఇంగ్లండ్‌ లోయరార్డర్‌ ఆటగాళ్లు కీలక సమయాల్లో బ్యాట్‌ ఝళిపించే నైపుణ్యం ఉండడంతో విజయంపై సందేహాలు ఏర్పడ్డాయి. కానీ ఆఖరి రోజు హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌ విజృంభణకు ఇంగ్లండ్‌ కుదేలైంది. చారిత్రక విజయం మన సొంతమైంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 05:09 AM