Share News

రెండో టెస్ట్‌కు బుమ్రా దూరం

ABN , Publish Date - Jun 27 , 2025 | 06:06 AM

రెండో టెస్ట్‌ ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా ఎంతో ఆధారపడిన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బర్మింగ్‌హామ్‌ టెస్ట్‌కు దూరమవుతాడన్న...

రెండో టెస్ట్‌కు బుమ్రా దూరం

న్యూఢిల్లీ: రెండో టెస్ట్‌ ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా ఎంతో ఆధారపడిన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బర్మింగ్‌హామ్‌ టెస్ట్‌కు దూరమవుతాడన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. తొలి టెస్ట్‌లో మిగతా పేసర్లు విఫలమైనా బుమ్రా ఒంటరి పోరాటం చేశాడు. అయితే, పనిభారం నిర్వహణలో భాగంగా బర్మింగ్‌హామ్‌ టెస్ట్‌కు బుమ్రాకు విశ్రాంతినివ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే, లీడ్స్‌లో అనూహ్యంగా ఓటమిపాలైన భారత్‌.. పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత మాజీ ఆటగాడు రవిశాస్త్రి చెప్పాడు. బుమ్రాకు విశ్రాంతినిస్తే భారత్‌ 0-2తో వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ‘ఈ సిరీస్‌లో మూడు టెస్టులు మాత్రమే ఆడతానని బుమ్రా చెప్పాడు. కానీ, అవి ఏవేవో చెప్పలేదు. ఒకవేళ రెండో మ్యాచ్‌కు దూరమైతే.. లార్డ్స్‌ టెస్ట్‌లో కచ్చితంగా ఆడాలనుకొంటాడు. అయితే, బర్మింగ్‌హామ్‌లో బుమ్రా బరిలోకి దిగకపోతే భారత్‌ 0-2తో వెనుకబడుతుంది. టీమిండియా పోటీలో ఉండాలంటే మాత్రం బుమ్రా ఆడితీరాల’ని శాస్త్రి చెప్పాడు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ బలహీనంగా ఉండడంతోపాటు ఆ టీమ్‌ను గాయాల బెడద వెంటాడుతోందన్నాడు. వీటిని అవకాశాలుగా మలచుకొని భారత్‌ పంచ్‌ ఇవ్వాలని సూచించాడు. అలా జరగాలంటే టీమ్‌లో బుమ్రా ఉండాలని అన్నాడు.

ఇవీ చదవండి:

ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు

అనుకున్నంత పని చేశారుగా

బుమ్రా గాలి తీసిన సంజన

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 06:06 AM