IPL 2025: ఐపీఎల్ ప్రారంభమయ్యేది ఎప్పుడు.. బోర్డు వర్గాలు ఏమంటున్నాయి
ABN , Publish Date - May 10 , 2025 | 08:40 PM
భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. అయితే భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయినట్టే.
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ (IPL 2025) అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. అయితే భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయినట్టే. అయితే కొన్ని సమస్యలు, అనుమానాలు మాత్రం ఉన్నాయి.
ఐపీఎల్ వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలకు చెందిన క్రికెటర్లు తమ తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. కొందరు అంతర్జాతీయ మ్యాచ్‌లకు రెడీ అవుతున్నారు. జూన్ 11వ తేదీ నుంచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాల క్రికెటర్లు తిరిగి భారత్‌కు రావడం కష్టం కావచ్చు. పలు జట్లలో ఈ రెండు దేశాల ఆటగాళ్లే కీలకంగా ఉన్నారు.
ఇక, ఐపీఎల్ వచ్చే వారాంతంలో లేదా అంతకు ముందే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అంతకు ముందుగానే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంఛైజీల ప్రతినిధులతోనూ, స్టేక్ హోల్డర్స్‌తోనూ, ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే సంస్థలతోనూ, స్పాన్సర్లతోనూ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఆ సమావేశం అధారంగా ఐపీఎల్‌ను ఎంత వీలైతే అంత తొందరగా ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..