Share News

Championship: వరల్డ్‌ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌ ప్రణవ్‌

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:44 AM

భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రణవ్‌ వెంకటేశ్‌ వరల్డ్‌ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచాడు.

 Championship: వరల్డ్‌ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌ ప్రణవ్‌

పెట్రోవాక్‌ (మాంటెనీగ్రో): భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రణవ్‌ వెంకటేశ్‌ వరల్డ్‌ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్‌ రౌండ్‌లో తెల్లపావులతో ఆడిన తను మేటిక్‌ లారెన్సిక్‌ (స్లొవేనియా)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో ఆడిన 11 రౌండ్లలో ఈ చెన్నై కుర్రాడు తొమ్మిది పాయింట్లతో అజేయుడిగా నిలిచాడు. 2008లో అభిజిత్‌ గుప్తా తర్వాత ఈ టోర్నీ గెలిచిన భారతీయుడయ్యాడు. ఈ క్లాసికల్‌ చెస్‌ ఓపెన్‌ విభాగంలో మొత్తంగా 157 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ప్రణవ్‌ విజయంపై విశ్వనాథన్‌ ఆనంద్‌ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు గతేడాది డిసెంబరులో చెన్నైకి చెందిన గుకేశ్‌ వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Updated Date - Mar 08 , 2025 | 03:46 AM