Share News

Chess Victory: విజేత అరవింద్‌

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:40 AM

అంతర్జాతీయ చెస్‌ యవనికపైకి మరో భారత యువ సంచ లనం దూసుకొచ్చింది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల అరవింద్‌ చిదంబరం ప్రేగ్‌

Chess Victory: విజేత అరవింద్‌

‘ప్రేగ్‌’ చెస్‌ మాస్టర్స్‌ టోర్నీ

ప్రేగ్‌: అంతర్జాతీయ చెస్‌ యవనికపైకి మరో భారత యువ సంచ లనం దూసుకొచ్చింది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల అరవింద్‌ చిదంబరం ప్రేగ్‌ మాస్టర్స్‌ చెస్‌ టైటిల్‌ కొల్లగొట్టాడు. గ్రాండ్‌మాస్టర్‌ అరవింద్‌ చిదంబరం 9 రౌండ్ల ఈ టోర్నమెంట్‌ .చివరి గేమ్‌ను డ్రాగా ముగించాడు. టర్కీకి చెందిన ఎడిజ్‌ గురెల్‌తో తొమ్మిదో రౌండ్‌లో 39 ఎ త్తుల అనంతరం చిదంబరం పాయింట్‌ పంచుకున్నాడు. దాంతో మొత్తం ఆరు పాయింట్లతో చిదంబరం విజేతగా నిలిచాడు. అరవింద్‌కు ఇది తొలి అంతర్జాతీయ టైటిల్‌ కావడం విశేషం. మరో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద (5) ఆఖరి రౌండ్‌లో అనిష్‌ గిరి చేతిలో పరాజయం చవిచూశాడు. ఐదు పాయింట్లతో ప్రజ్ఞానంద రెండో స్థానంతో టోర్నీని ముగించాడు. ఇదే టోర్నమెంట్‌ చాలెంజర్స్‌ విభాగంలో ఉజ్బెకిస్థాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ యకుబేవ్‌ టైటిల్‌ దక్కించుకున్నాడు. ఈ విభాగంలో తలపడిన భారత జీఎం దివ్యా దేశ్‌ముఖ్‌ (3 పాయింట్లు) తొమ్మిదో స్థానంతో నిరాశ పరిచింది.

Updated Date - Mar 08 , 2025 | 03:41 AM