AUS vs IND Live Updates: ఐదో టీ20.. సిరీస్ కొడతామా?
ABN , First Publish Date - Nov 08 , 2025 | 01:27 PM
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఇవాళ గబ్బాలో ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. దీంట్లోనూ అదరగొట్టి సిరీస్ పట్టేయాలని సూర్య సేన ఉవ్విళ్లూరుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. మిగతా మూడులో టీమిండియా రెండు గెలిచిన సంగతి తెలిసిందే.
Live News & Update
-
Nov 08, 2025 17:01 IST
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అభిషేక్ శర్మ
* టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
-
Nov 08, 2025 16:25 IST
మ్యాచ్ రద్దు.. సిరీస్ టీమిండియాదే
* గబ్బా పరిసర ప్రాంతాల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
* దీంతో ఆసీస్‌తో టీ20 సిరీస్ భారత్ కైవసం
* వర్షం కారణంగానే తొలి మ్యాచ్ కూడా రద్దు
* మూడింట్లో రెండు గెలిచిన టీమిండియా
-
Nov 08, 2025 15:12 IST
మొదలైన వర్షం
* గబ్బా స్టేడియం పరిసర ప్రాంతాల్లో మొదలైన వర్షం
* ఓపిగ్గా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు
* మైదానంలో పిచ్ ప్రాంతంలో మాత్రమే కవర్లు కప్పారు
* గ్రౌండ్‌లో అద్భుతంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ
* దీంతో వర్షం నిలిచిన కాసేపటికే మైదానాన్ని సిద్ధం చేసే ఛాన్స్
-
Nov 08, 2025 14:12 IST
వరుణుడు ఆటంకం..ఆగిన మ్యాచ్
* భారత్-ఆసీస్ ఐదో టీ20కి వరుణుడి ఆటంకం
* మ్యాచ్ జరుగుతున్న గబ్బా స్టేడియం పరిసర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్
* దీంతో 4.5 ఓవర్ల తర్వాత తాత్కాలికంగా ఆగిన మ్యాచ్
* అభిషేక్ శర్మ(23), గిల్(29) క్రీజులో ఉన్నారు
* ఆట ఆగే సమయానికి భారత్ స్కోర్.. 52/0
-
Nov 08, 2025 13:58 IST
గిల్ ఆన్ ఫైర్..
* డ్వార్షుయిస్ బౌలింగ్‌లో నాలుగు ఫోర్లు బాదిన గిల్
* మూడో ఓవర్లో టీమిండియా సాధించిన పరుగులు 16
* ప్రస్తుతం భారత్ స్కోరు.. 35/0
-
Nov 08, 2025 13:49 IST
దూకుడుగా ఆడుతున్న ఓపెనర్లు..
* దూకుడుగా ఆడుతున్న టీమిండియా బ్యాటర్లు
* తొలి ఓవర్‌లోనే చెరో ఫోర్ బాదిన గిల్, అభిషేక్
-
Nov 08, 2025 13:47 IST
బ్యాటింగ్ ప్రారంభం..
* మొదలైన ఆస్ట్రేలియా-భారత్ ఐదో టీ20 మ్యాచ్
* క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్
* బౌలింగ్ ప్రారంభించిన ఆసీస్ బౌలర్ డ్వార్షుయిస్
-
Nov 08, 2025 13:33 IST
AUS vs IND: భారత్ తుది జట్టు ఇదే
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
-
Nov 08, 2025 13:32 IST
ఆసీస్ తుది జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.
-
Nov 08, 2025 13:30 IST
టాస్ గెలిచిన ఆసీస్..
* ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఐదో టీ20 కాసేపట్లో ప్రారంభం కానుంది
* దీంట్లో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది
* దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
-
Nov 08, 2025 13:27 IST
కెప్టెన్ ఫామ్ అందుకుంటాడా?
బౌలింగ్‌లో సత్తా చాటుతున్నా.. బ్యాటింగ్‌లో ఎవరూ స్థిరంగా ఆడకపోవడమే ఈ సిరీస్‌లో భారత్‌కు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గిల్ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. క్రీజులో కుదురుకున్నాక ఔట్ అవ్వడం గిల్ బలహీనతగా మారింది. ఆఖరి పోరులోనైనా సూర్య, గిల్ గాడిలో పడాలని జట్టు ఆశిస్తోంది.
-
Nov 08, 2025 13:27 IST
సిరీస్ పడతామా?
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఇవాళ గబ్బాలో ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. దీంట్లోనూ అదరగొట్టి సిరీస్ పట్టేయాలని సూర్య సేన ఉవ్విళ్లూరుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. మిగతా మూడులో టీమిండియా రెండు గెలిచిన సంగతి తెలిసిందే.