Share News

AUS vs IND Live Updates: ఐదో టీ20.. సిరీస్ పడతామా?

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:14 PM

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఇవాళ గబ్బాలో ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. దీంట్లోనూ అదరగొట్టి సిరీస్ పట్టేయాలని సూర్య సేన ఉవ్విళ్లూరుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. మిగతా మూడులో టీమిండియా రెండు గెలిచిన సంగతి తెలిసిందే.

AUS vs IND Live Updates: ఐదో టీ20.. సిరీస్ పడతామా?
AUS vs IND

ఐదో టీ20.. సిరీస్ పడతామా?

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఇవాళ గబ్బాలో ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. దీంట్లోనూ అదరగొట్టి సిరీస్ పట్టేయాలని సూర్య సేన ఉవ్విళ్లూరుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. మిగతా మూడులో టీమిండియా రెండు గెలిచిన సంగతి తెలిసిందే.

కెప్టెన్ ఫామ్ అందుకుంటాడా?

బౌలింగ్‌లో సత్తా చాటుతున్నా.. బ్యాటింగ్‌లో ఎవరూ స్థిరంగా ఆడకపోవడమే ఈ సిరీస్‌లో భారత్‌కు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గిల్ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. క్రీజులో కుదురుకున్నాక ఔట్ అవ్వడం గిల్ బలహీనతగా మారింది. ఆఖరి పోరులోనైనా సూర్య, గిల్ గాడిలో పడాలని జట్టు ఆశిస్తోంది.

Updated Date - Nov 08 , 2025 | 01:19 PM