Share News

Kho-Kho World Cup : సెమీస్‌కు భారత్‌

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:06 AM

మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్‌లో భారత జట్లు టైటిల్‌ దిశగా దూసుకు పోతున్నాయి. ఈక్రమంలో మన మహిళలు, పురుషుల జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.

Kho-Kho World Cup : సెమీస్‌కు భారత్‌

ఖోఖో ప్రపంచకప్‌

న్యూఢిల్లీ: మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్‌లో భారత జట్లు టైటిల్‌ దిశగా దూసుకు పోతున్నాయి. ఈక్రమంలో మన మహిళలు, పురుషుల జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ప్రియాంక ఇంగ్లే సారథ్యంలో మహిళల జట్టు 109-16 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ప్రతీక్‌ వైకర్‌ కెప్టెన్సీలో పురుషుల జట్టు 100-40 పాయింట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. కాగా, ఈ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు వరుసగా నాలుగోసారి 100 పాయింట్ల మార్క్‌ను అందుకోవడం విశేషం. శనివారం జరిగే సెమీఫైనల్లో మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. మరో సెమీస్‌లో నేపాల్‌-ఉగాండా ఢీకొంటాయి. ఇక భారత పురుషులు సెమీఫైనల్లో దక్షిణాఫిక్రాతో అమీతుమీ తేల్చుకుంటారు. రెండో సెమీస్‌లో ఇరాన్‌-నేపాల్‌ తలపడతాయి.

Updated Date - Jan 18 , 2025 | 05:06 AM