Share News

Minister Mandaviya: ప్రతిభాన్వేషణ, వసతుల కల్పన క్రీడాభివృద్ధిలో కీలకం

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:37 AM

ఒలింపిక్స్‌’పై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పక్కాగా అడుగులు వేస్తోంది. 2028 లాస్‌ఏంజెల్స్‌ విశ్వ క్రీడలకు...

Minister Mandaviya: ప్రతిభాన్వేషణ, వసతుల కల్పన క్రీడాభివృద్ధిలో కీలకం

  • కేంద్ర క్రీడా మంత్రి మాండవ్య

షాద్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి): ‘ఒలింపిక్స్‌’పై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పక్కాగా అడుగులు వేస్తోంది. 2028 లాస్‌ఏంజెల్స్‌ విశ్వ క్రీడలకు సన్నాహకాలతోపాటు, 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి బిడ్‌ దాఖలు చర్యలు చేపట్టిన భారత్‌..అందుకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో మేథోమధనం ప్రారంభించింది. ఈ మేరకు రెండు రోజుల చింతన శిబిరం శుక్రవారం రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో మొదలైంది. శిబిరాన్ని ప్రారంభించిన కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్య..క్రీడల్లో భారత్‌ తిరుగులేని శక్తిగా అవతరించేందుకు అందరూ చేతులు కలపాలని పిలుపు నిచ్చారు. భారత్‌ను ప్రపంచ క్రీడా శక్తిగా నిలపాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించుకున్నారని చెప్పారు. ‘ఈ క్రమంలో ప్రతిభను గుర్తించడం, అధునాతన శిక్షణ పద్ధతులు ఆచరించడం, మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యం. తద్వారా క్రీడల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించాలి’ అని మంత్రి పిలుపు నిచ్చారు. శిబిరంలో రాష్ట్రాల క్రీడల మంత్రులు, క్రీడా పరిపాలకులు, సీనియర్‌ అధికారులు పాల్గొంటున్నారు.

Updated Date - Mar 08 , 2025 | 03:37 AM