Share News

Asia Cup 2025: భారత్‌ పాక్‌ జట్లు ఆడతాయి

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:37 AM

వచ్చే నెలలో జరగాల్సిన ఆసియాకప్‌ టీ20 టోర్నీపై ఇటీవలి వరకు సందిగ్ధత కొనసాగింది. అయితే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) షెడ్యూల్‌ను ప్రకటించడంతో అందరి సందేహాలు..

Asia Cup 2025: భారత్‌ పాక్‌ జట్లు ఆడతాయి

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగాల్సిన ఆసియాకప్‌ టీ20 టోర్నీపై ఇటీవలి వరకు సందిగ్ధత కొనసాగింది. అయితే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) షెడ్యూల్‌ను ప్రకటించడంతో అందరి సందేహాలు తీరాయి. సెప్టెంబరు 9 నుంచి 28 వరకు తటస్థ వేదిక దుబాయ్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఒకే గ్రూపులో ఉన్న భారత్‌-పాక్‌ జట్లు అదే నెల 14న మ్యాచ్‌లో తలపడతాయి. కానీ పహల్గాం ఉగ్రదాడుల తర్వాత కూడా పాక్‌తో మ్యాచ్‌ ఆడడమేంటన్న విమర్శలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది. అటు జాతీయ క్రీడా బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు కాబట్టి బోర్డు క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని, ప్రజల మనోభావాలపై వారు ఎలా స్పందిస్తారో చూడాల్సిందేనని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆసియాక్‌పలో పాక్‌తో మ్యాచ్‌ను ఆడకుంటే భారత్‌కే నష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇది ద్వైపాక్షిక సిరీస్‌ కాదు కాబట్టి వాకోవర్‌ ఇస్తే కీలక పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుందని, అది పాక్‌కే లాభిస్తుందని చెబుతున్నారు. అందుకే ఈ మ్యాచ్‌ రద్దు కాకపోవచ్చని తేల్చారు. అంతేకాకుండా ఈ రెండు జట్లు తలపడితే వ్యాపార పరంగా భారీ ఆదాయం చేకూరుతుందని, కానీ రద్దయితే బ్రాడ్‌కాస్టర్‌కే కాకుండా ఇతర ఏసీసీ సభ్య దేశాలకు కూడా ఆర్థికంగా నష్టం చేకూరినట్టేనని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 30 , 2025 | 05:37 AM