Share News

India on the Brink of Defeat: ఓటమి అంచున టీమిండియా..!

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:27 PM

గువాహటి టెస్ట్‌లో భారత్ ఓటమి అంచున ఉంది. 27/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా చకచకా వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టీ విరామ సమయానికి 47 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ స్కోర్..

India on the Brink of Defeat: ఓటమి అంచున టీమిండియా..!
India vs South Africa

గువాహటి టెస్ట్‌(Guwahati Test)లో భారత్ ఓటమి అంచున ఉంది. 27/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా చకచకా వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టీ విరామ సమయానికి 47 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. టీ బ్రేక్ తర్వాత సాయి సుదర్శన్‌ (14; 139 బంతులు) ముత్తుసామి బౌలింగ్‌లో మార్క్‌రమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 58 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన టీమిండియాను కుప్పకూలకుండా జడేజా, సాయిదర్శన్(Sai Sudharsan) నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సాయి సుదర్శన్‌ సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (23*), వాషింగ్టన్ సుందర్(10*) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 61 బంతుల్లో 23 పరుగులు జత చేశారు.


టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (13), కేఎల్‌ రాహుల్‌ (6) నాలుగో రోజే (మంగళవారం) పెవిలియన్‌కు చేరారు. ఈ రోజు ఆట ప్రారంభంలో సాయి సుదర్శన్‌, కుల్దీప్‌ యాదవ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. మార్కో యాన్సన్‌ వేసిన 18.2 ఓవర్ లో సుదర్శన్‌ నాలుగు పరుగుల వద్ద వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అంపైర్‌ ఔట్‌గా కూడా ప్రకటించాడు. కానీ అది నోబాల్‌గా థర్డ్‌ అంపైర్‌ తేల్చడంతో సాయి సుదర్శన్ బతికిపోయాడు.


తర్వాత కాసేపటికి సైమన్‌ ఆర్మర్‌ బౌలింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఎడెన్ మార్క్‌రమ్ అందుకోలేకపోయాడు. తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సాయిసుదర్శన్‌ చాలా సమయం పాటు క్రీజులో ఉన్నాడు. 95 పరుగుల వద్ద ముత్తుసామి బౌలింగ్ లో మార్క్‌రమ్ కి క్యాచ్ ఇచ్చిన సాయి పెవిలియన్ చేరాడు. ప్రొటీస్ బౌలర్లలో సైమన్ హార్మర్(Simon Harmer) నాలుగు వికెట్లు తీశాడు. ముత్తుసామి, మార్కో చెరో వికెట్ సాధించారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 125/6 గా ఉంది.


ఇవి కూడా చదవండి:

Nikhil Choudhary: ఆస్ట్రేలియా గడ్డపై భారతీయుడి సరికొత్త చరిత్ర

Basketball Player Death: బాస్కెట్‌బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ 16 ఏళ్ల నేషనల్ ప్లేయర్ దుర్మరణం

Updated Date - Nov 26 , 2025 | 12:31 PM