Share News

India Hockey: ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:39 AM

సొంతగడ్డపై చెలరేగుతున్న భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్‌లో ఫైనల్‌ బెర్తే లక్ష్యంగా చైనాతో శనివారం అమీతుమీకి సిద్ధమైంది. సూపర్‌-4 దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలన్న కసితో...

India Hockey: ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా

  • పురుషుల హాకీలో చైనాతో భారత్‌ పోరు నేడు

  • రాత్రి 7.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

రాజ్‌గిర్‌ (బిహార్‌): సొంతగడ్డపై చెలరేగుతున్న భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్‌లో ఫైనల్‌ బెర్తే లక్ష్యంగా చైనాతో శనివారం అమీతుమీకి సిద్ధమైంది. సూపర్‌-4 దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలన్న కసితో భారత్‌ బరిలో దిగనుంది. సూపర్‌-4లో భారత్‌.. మొత్తం నాలుగు పాయింట్లతో టాప్‌లో ఉంది. చైనా, మలేసియా చెరో మూడు పాయింట్లతో తర్వాతి స్థానంలో ఉండగా, కొరియా కేవలం ఒక పాయింట్‌తో చివర్లో ఉంది. ఈ నేపథ్యంలో చైనాతో మ్యాచ్‌ను కనీసం డ్రాగా ముగించినా, భారత్‌ ఫైనల్‌ చేరేందుకు అవకాశముంది. సూపర్‌-4లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్‌ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

వార్నీ.. చివరకు నకిలీ టికెట్లు కూడానా.. విషయం ఏంటంటే..

బ్యాంక్ ఉద్యోగిని కొంపముంచిన ఏఐ.. ఇంత మోసమా?..

Updated Date - Sep 06 , 2025 | 03:39 AM