India Cricket Tour 2026: వచ్చే ఏడాదీ ఇంగ్లండ్‌లో పర్యటన
ABN , Publish Date - Jul 25 , 2025 | 02:00 AM
ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీ్‌సలో బిజీగా ఉన్న టీమిండియా వచ్చే ఏడాది కూడా ఇంగ్లండ్‌కు రానుంది. 2026, జూలై 1 నుంచి 19 వరకు ఇరు జట్ల మధ్య ఐదు...
భారత క్రికెట్ జట్ల షెడ్యూలు
మాంచెస్టర్: ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీ్‌సలో బిజీగా ఉన్న టీమిండియా వచ్చే ఏడాది కూడా ఇంగ్లండ్‌కు రానుంది. 2026, జూలై 1 నుంచి 19 వరకు ఇరు జట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డేల సిరీ్‌సలు జరుగుతాయని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈ సీబీ) వెల్లడించింది. అలాగే భారత మహిళల జట్టు కూడా మూడు టీ20ల సిరీస్, ఏకైక టెస్టు కోసం మరోసారి పర్యటించనుంది. మే 28 నుంచి జూన్ 1 వరకు ఇంగ్లండ్ మహిళల జట్టుతో పొట్టి ఫార్మాట్‌లో తలపడనుండగా, జూలై 10 నుంచి లార్డ్స్‌లో తొలిసారిగా మహిళల టెస్టు జరుగనుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి