క్వార్టర్స్‌లో భారత్
ABN , Publish Date - Jan 16 , 2025 | 06:18 AM
భారత పురుషులు, మహిళల జట్లు అదిరే ఆటతో ఖోఖో ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకు పోయాయి. గ్రూప్-ఎలో తలపడుతున్న మహిళల జట్టు బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 100-16 పాయింట్ల తేడాతో ఇరాన్‌ని....

ఖోఖో ప్రపంచ కప్
న్యూఢిల్లీ: భారత పురుషులు, మహిళల జట్లు అదిరే ఆటతో ఖోఖో ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకు పోయాయి. గ్రూప్-ఎలో తలపడుతున్న మహిళల జట్టు బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 100-16 పాయింట్ల తేడాతో ఇరాన్‌ని చిత్తు చేసింది. మొదటి టర్న్‌లోని ఏకంగా 50 పాయింట్లు సాధించిన మన మహిళలు ఆ జోరును మిగిలిన మూడు టర్న్‌లలోనూ కొనసాగించారు. అంతకుముందు..మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 175-18 పాయింట్ల తేడాతో దక్షిణ కొరియాపై అద్భుత విజయంతో శుభారంభం అందుకుంది. నాలుగు జట్ల గ్రూప్-ఎలో మహిళల జట్టు రెండు విజయాలతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక..పురుషుల జట్టు హ్యాట్రిక్ కొట్టింది.
బుధవారం జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో మనోళ్లు 70-38తో పెరూపై నెగ్గారు. తెలుగు ఆటగాడు పోతిరెడ్డి శివారెడ్డి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక..పోటీల తొలి రోజు నేపాల్‌ను ఓడించిన పురుషుల జట్టు మంగళవారం రెండో మ్యాచ్‌లో 64-34 స్కోరుతో బ్రెజిల్‌ను చిత్తు చేసింది. ఐదు జట్ల గ్రూపులో మొత్తం ఆరు పాయింట్లతో టాప్‌లో నిలిచింది.