Share News

క్వార్టర్స్‌కు భారత్‌

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:05 AM

ఆసియా బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌ప గ్రూప్‌-డిలో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ 5-0తో మకావు జట్టును ఓడించింది. ఈ గెలుపుతో భారత్‌ తన గ్రూప్‌ నుంచి క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ ఖరారు...

క్వార్టర్స్‌కు భారత్‌

కింగ్డావో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌ప గ్రూప్‌-డిలో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ 5-0తో మకావు జట్టును ఓడించింది. ఈ గెలుపుతో భారత్‌ తన గ్రూప్‌ నుంచి క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. తొలుత మిక్స్‌డ్‌లో సతీశ్‌/ఆద్య జోడీ 21-10, 21-9తో లియోంగ్‌/వెంగ్‌పై నెగ్గగా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 21-16, 21-12తో పంగ్‌ ఫాంగ్‌పై, మహిళల సింగిల్స్‌లో మాళవిక 21-15, 21-9తో హావో వాయిపై గెలిచారు. పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌/అర్జున్‌ జంట 21-15, 21-19తో చిన్‌ పాన్‌/కొక్‌ వెన్‌ను, చివరిగా మహిళల డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా ద్వయం 21-10, 21-5తో ఎన్‌ వెంగ్‌ చి/పూయి చి వానును ఓడించడంతో భారత్‌ తిరుగులేని ఆధిక్యంతో క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఇక గ్రూప్‌లో తనకు చివరిదైన రెండో మ్యాచ్‌ను భారత్‌ గురువారం కొరియాతో ఆడనుంది. దీంతో ఈ గ్రూప్‌ టాపర్‌ ఎవరనేది తేలుతుంది. కొరియా ఇప్పటికే మకావును ఓడించింది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2025 | 05:05 AM