Share News

పోరాడి ఓడిన భారత్‌

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:57 AM

ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప గ్రూప్‌-డి రెండో పోరులో భారత్‌ ఓటమి చవిచూసింది. గురువారం జరిగిన పోరులో దక్షిణ కొరియా 3-2తో భారత్‌పై గెలుపొందింది. అయితే గ్రూపులో...

పోరాడి ఓడిన భారత్‌

దక్షిణ కొరియా గెలుపు

ఆసియా టీమ్‌ చాంపియన్‌షి్‌ప

క్వింగ్డావో (చైనా): ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప గ్రూప్‌-డి రెండో పోరులో భారత్‌ ఓటమి చవిచూసింది. గురువారం జరిగిన పోరులో దక్షిణ కొరియా 3-2తో భారత్‌పై గెలుపొందింది. అయితే గ్రూపులో రెండో స్థానంలో నిలిచిన మనోళ్లు ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. కొరియాతో..తొలుత మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల/తనీషా క్రాస్టో జంట, సింగిల్స్‌లో మాళవిక పరాజయం పాలయ్యారు. పురుషుల సింగిల్స్‌లో సతీష్‌, మహిళల డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా నెగ్గడంతో మనోళ్లు 2-2తో సమం చేశారు. కానీ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌/అర్జున్‌ ఓడ డంతో కొరియాకు విజయం దక్కింది. శుక్రవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకుంటుంది. ఇందులో విజయం సాధిస్తే కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 14 , 2025 | 01:57 AM