WTC Points Table: నాలుగో స్థానానికి టీమిండియా
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:40 AM
కోల్‌కతా టెస్ట్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడడంతో.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ 54.17 విజయాల శాతంతో మూడునుంచి నాలుగో స్థానానికి దిగజారింది...
న్యూఢిల్లీ: కోల్‌కతా టెస్ట్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడడంతో.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ 54.17 విజయాల శాతంతో మూడునుంచి నాలుగో స్థానానికి దిగజారింది. 2025-27 డబ్ల్యూటీసీ వలయంలో ఆడిన ఎనిమిది టెస్ట్‌ల్లో టీమిండియాకిది మూడో ఓటమి. అయితే, చిరస్మరణీయ విజయాన్ని సాధించిన దక్షిణాఫ్రికా నాలుగు నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక, భారత్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన మూడింటిలోనూ నెగ్గిన ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఇక గువహటిలో జరిగే రెండో టెస్టులో నెగ్గితే భారత్ మళ్లీ మూడోస్థానానికి చేరుతుంది. డ్రా అయితే నాలుగులోనే ఉంటుంది. ఒక వేళ ఓడితే ఐదోస్థానానికి పడిపోతుంది.
ఇవి కూడా చదవండి..
కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎన్నికల ఫలితాలు.. లాలూ కూతురి వరుస పోస్టులు..
లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.