Share News

India A England Tour: కరుణ్‌కు పిలుపు

ABN , Publish Date - May 17 , 2025 | 01:44 AM

ఇంగ్లండ్‌ పర్యటనకు భారత ‘ఎ’ జట్టు 18 మందితో ఎంపిక అయింది. రంజీ ఆటలో మంచి ప్రదర్శన ఇచ్చిన కరుణ్ నాయర్, పేసర్ శార్దూల్ ఠాకూర్‌తో సహా కొత్త ప్లేయర్లు జట్టులో చోటు సంపాదించారు.

India A England Tour: కరుణ్‌కు పిలుపు

  • శార్దూల్‌కు కూడా..

  • ఇంగ్లండ్‌ ‘ఎ’తో పోరుకు భారత్‌ ‘ఎ’ జట్టు

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లో పర్యటించే భారత్‌ ‘ఎ’ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్‌ నేతృత్వం వహించనున్నాడు. 18 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు శుక్రవారం ప్రకటించారు. రంజీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కరుణ్‌ నాయర్‌కు చోటు కల్పించారు. ఇంగ్లండ్‌ ‘ఎ’తో ఈనెల 30 నుంచి జరిగే రెండు ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో అతను మెరుగైన ప్రదర్శన కనబరిస్తే తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కొచ్చు. కరుణ్‌తో పాటు పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను జట్టులో చేర్చారు. వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఇషాన్‌ కిషన్‌ రెండో కీపర్‌గా ఉంటాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ జట్లు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకోవడంతో నితీశ్‌ కుమార్‌, ఇషాన్‌, జైస్వాల్‌ను ఎంపిక చేశారు. చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ ఈ టూర్‌కు అందుబాటులో ఉండనున్నాడు. గిల్‌, సాయి సుదర్శన్‌ మాత్రం జూన్‌ 6 నుంచి జరిగే రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారు. అలాగే భారత్‌ ‘ఎ’ జూన్‌ 13 నుంచి నాలుగు రోజుల మ్యాచ్‌లోనూ తలపడనుంది.

భారత్‌ ‘ఎ’ జట్టు: అభిమన్యు ఈశ్వరన్‌ (కెప్టెన్‌), జైస్వాల్‌, రుతురాజ్‌, కరుణ్‌, జురెల్‌, నితీశ్‌ కుమార్‌, శార్దూల్‌, ఇషాన్‌, సర్ఫరాజ్‌, ముకేశ్‌, తుషార్‌, ఆకాశ్‌ దీప్‌, హర్షిత్‌ రాణా, కాంబోజ్‌,ఖలీల్‌, తుషార్‌, హర్ష్‌ దూబే, సుతార్‌, గిల్‌, సుదర్శన్‌ (వీరిద్దరూ రెండో మ్యాచ్‌కు).

Updated Date - May 17 , 2025 | 01:46 AM