India Begins Womens ODI World Cup: భారత్ శుభారంభం
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:54 AM
మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో తొలి టైటిల్ వేటను భారత్ ఘనంగా ఆరంభించింది. దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌షో (53; 3/54)తో అదరగొట్టగా మంగళవారం శ్రీలంకతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన...
నేటి మ్యాచ్
ఆస్ట్రేలియా X న్యూజిలాండ్
మ.3 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో
శ్రీలంకపై ఘనవిజయం
దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షో జూమహిళల వన్డే వరల్డ్‌కప్
గువాహటి: మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో తొలి టైటిల్ వేటను భారత్ ఘనంగా ఆరంభించింది. దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌షో (53; 3/54)తో అదరగొట్టగా మంగళవారం శ్రీలంకతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 59 రన్స్ తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌కు రెండుసార్లు వర్షం ఆటంకం కలిగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 47 ఓవర్లలో 8 వికెట్లకు 269 పరుగులు చేసింది. అమన్‌జోత్ (57), హర్లీన్ (48), ప్రతీకా రావల్ (37), స్నేహ్ రాణా (28 నాటౌట్) రాణించారు. అటు ఫీల్డింగ్‌లో నిరాశపరిచిన లంక అమన్‌జోత్ నాలుగు క్యాచ్‌లను జారవిడిచి మూల్యం చెల్లించుకుంది. స్పిన్నర్ ఇనోక రణవీరకు నాలుగు, ప్రబోధనికి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో శ్రీలంకకు డ/లూ పద్దతిన 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 45.4 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చమరి ఆటపట్టు (43), నీలాక్షి (35), హర్షిత (29) మాత్రమే రాణించారు. స్నేహ్, శ్రీచరణిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా దీప్తి శర్మ నిలిచింది.
శతక భాగస్వామ్యం: టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగగా నాలుగో ఓవర్‌లోనే మంధాన (8) అవుట్‌తో షాక్ తగిలింది. అయితే హర్లీన్, ప్రతీకా రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. 26వ ఓవర్‌లో హర్లీన్, జెమీమా (0), హర్మన్‌ప్రీత్ (21)లను స్పిన్నర్ రణవీర అవుట్ చేయగా, తర్వాతి ఓవర్‌లోనే రిచా (2) సైతం వెనుదిరిగింది. దీంతో కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి 124/6 స్కోరుతో భారత్ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో 200 రన్స్ అసాధ్యంగానే అనిపించింది. కానీ దీప్తి-అమన్‌జోత్ జోడీ లంక బౌలర్లను పట్టుదలగా ఎదుర్కొంది. సమన్వయ ఆటతీరుతో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేయడంతో పాటు ఏడో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. ఇక స్నేహ్ రాణా ధనాధన్ బ్యాటింగ్‌తో ఆఖరి రెండు ఓవర్లలో 34 పరుగులు సమకూర్చగా భారత్ 260+ స్కోరు దాటింది.
స్కోరుబోర్డు
భారత్: ప్రతికా (సి) గుణరత్నే (బి) రణవీర 37, మంధాన (సి) గుణరత్నే (బి) ప్రబోధని 8, హర్లీన్ (సి) దిల్హరి (బి) రణవీర 48, హర్మన్‌ప్రీత్ (సి) సంజీవని (బి) రణవీర 21, జెమీమా (బి) రణవీర 0, దీప్తి శర్మ (సి) సుగంధిక (బి) కులసూర్య 53, రిచా ఘోష్ (సి) ప్రబోధని (బి) ఆటపట్టు 2, అమన్‌జోత్ (సి) గుణరత్నే (బి) ప్రబోధని 57, స్నేహ్ రాణా (నాటౌట్) 28, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 47 ఓవర్లలో 269/8; వికెట్ల పతనం: 1-14, 2-81, 3-120, 4-120, 5-121, 6-124, 7-227, 8-269; బౌలింగ్: కులసూర్య 8-0-42-1, ప్రబోధని 10-1-55-2, సుగంధిక 9-0-46-0, దిల్హరి 8-0-51-0, రణవీర 9-0-46-4, ఆటపట్టు 3-0-24-1.
శ్రీలంక: హాసిని పెరీరా (బి) క్రాంతి 14, ఆటపట్టు (బి) దీప్తి 43, సమరవిక్రమ (ఎల్బీ) శ్రీచరణి 29, విష్మి గుణరత్నే (ఎల్బీ) అమన్‌జోత్ 11, దిల్హరి (సి) రిచా (బి) దీప్తి 15, నీలాక్షిక సిల్వా (బి) స్నేహ్ రాణా 35, సంజీవని (సి) హర్మన్ (బి) దీప్తి 6, సుగంధిక (బి) స్నేహ్ రాణా 10, కులసూర్య (సి) మంధాన (బి) శ్రీచరణి 17, ప్రబోధని (నాటౌట్) 14, రణవీర (ఎల్బీ) ప్రతిక 3, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 45.4 ఓవర్లలో 211 ఆలౌట్; వికెట్ల పతనం: 1-30, 2-82, 3-103, 4-105, 5-130, 6-140, 7-173, 8-184, 9-199, 10-211; బౌలింగ్: క్రాంతి గౌడ్ 9-0-41-1, అమన్‌జోత్ 6-0-37-1, స్నేహ్ రాణా 10-0-32-2, దీప్తి శర్మ 10-1-54-3, శ్రీచరణి 8-0-37-2, ప్రతీకా రావల్ 2.4-0-6-1,
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం