India Bangladesh Womens Cricket: భారత్ బంగ్లా మహిళల సిరీస్ వాయిదా
ABN , Publish Date - Nov 19 , 2025 | 04:57 AM
భారత్ బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య డిసెంబరులో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడింది. ఐసీసీ ఎఫ్‌టీపీ ప్రకారం ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20ల...
న్యూఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య డిసెంబరులో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడింది. ఐసీసీ ఎఫ్‌టీపీ ప్రకారం ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీ్‌సలు ఆడాల్సి ఉంది. కోల్‌కతా, కటక్‌లో ఈ మ్యాచ్‌లను నిర్వహించాలనుకున్నారు. అయితే భారత్‌లో తలదాచుకున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి కోర్టు సోమవారం మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు సున్నితంగా మారాయి. కానీ వాయిదా నిర్ణయం వెనుక కారణాన్ని మాత్రం బీసీసీఐ చెప్పలేదు. ‘డిసెంబరులో మేం ప్రత్యామ్నాయ సిరీస్ కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతానికి బంగ్లాతో మాత్రం మ్యాచ్‌లు ఉండవు’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అటు బీసీసీఐ నుంచి ఈ మేరకు లేఖ అందిందని బంగ్లా క్రికెట్ బోర్డు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
IND VS BAN Women’s Series: భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై కీలక అప్ డేట్
NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి