Share News

బంగ్లాతో సిరీస్‌ రద్దు?

ABN , Publish Date - May 04 , 2025 | 02:43 AM

పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా భారత జట్టు క్రికెట్‌ షెడ్యూల్‌పై తీవ్ర ప్రభావమే పడనుంది. ఇప్పటికే పాకిస్థాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లను పూర్తిగా బాయ్‌కాట్‌ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా...

బంగ్లాతో సిరీస్‌ రద్దు?

ఆసియాకప్‌ కూడా..

న్యూఢిల్లీ: పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా భారత జట్టు క్రికెట్‌ షెడ్యూల్‌పై తీవ్ర ప్రభావమే పడనుంది. ఇప్పటికే పాకిస్థాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లను పూర్తిగా బాయ్‌కాట్‌ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా భారత జట్టు బంగ్లాదేశ్‌ పర్యటన కూడా సందేహంగా మారింది. ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం టీమిండియా అక్కడికి వెళ్లాల్సి ఉంది. కానీ బంగ్లా రిటైర్డ్‌ ఆర్మీ అధికారి ఫజ్లూర్‌ రహమాన్‌ చేసిన వ్యాఖ్యలు ఈ సిరీ్‌సను సంశయంలో పడేశాయి. ఒకవేళ పాక్‌పై భారత్‌ దాడి చేస్తే వారి ఈశాన్య రాష్ట్రాలను బంగ్లా ఆక్రమించుకోవాలంటూ అతడు ప్రగల్భాలు పలికాడు. దీంతో ప్రస్తుత స్థితిలో ఈ సిరీస్‌ జరిగే అవకాశాలు తక్కువేనంటూ బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ ఏడాది తటస్థ వేదికపై జరగాల్సిన ఆసియాక్‌పపైనా అనిశ్చితి కొనసాగుతోంది. 8 దేశాలు తలపడనుండగా.. గ్రూప్‌ ఎలోనే భారత్‌-పాక్‌ జట్లు ఉండడం గమనార్హం.

ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 02:43 AM