Share News

Rising Stars Asia Cup: సెమీ్‌సలో భారత్‌ ఎ

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:47 AM

రైజింగ్‌ స్టార్స్‌ ఆసియాక్‌పలో భారత-ఎ జట్టు సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకొంది. హర్ష్‌ దూబే (53 నాటౌట్‌) అదరగొట్టడంతో.. గ్రూప్‌-బిలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో...

Rising Stars Asia Cup: సెమీ్‌సలో భారత్‌ ఎ

ఒమన్‌పై గెలుపు ఫ రైజింగ్‌ స్టార్స్‌ ఆసియాకప్‌

దోహా: రైజింగ్‌ స్టార్స్‌ ఆసియాక్‌పలో భారత-ఎ జట్టు సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకొంది. హర్ష్‌ దూబే (53 నాటౌట్‌) అదరగొట్టడంతో.. గ్రూప్‌-బిలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్లతో ఒమన్‌ను చిత్తు చేసింది. దీంతో 3 మ్యాచ్‌ల నుంచి భారత్‌-ఎ 4 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఒమన్‌, యూఏఈ టోర్నీ నుంచి అవుటయ్యాయి. తొలుత ఒమన్‌ 20 ఓవర్లలో 135/7 స్కోరు చేసింది. వసీం అలీ (54 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీ చేశాడు. సుయాన్ష్‌, గుర్‌ప్రీత్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో భారత్‌ 17.5 ఓవర్లలో 138/4 స్కోరు చేసి గెలిచింది. నమన్‌ (30), నేహల్‌ (23) రాణించారు.

ఇవి కూడా చదవండి:

IND VS BAN Women’s Series: భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌‌పై కీలక అప్ డేట్

NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2025 | 04:47 AM