Share News

Ind vs Eng: విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్.. చెలరేగుతున్న ఆకాష్ దీప్..

ABN , Publish Date - Jul 06 , 2025 | 08:02 PM

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది. చివరి రోజు భారత బౌలర్లు సంయమనంతో బౌలింగ్ చేస్తున్నారు. లక్ష్యం భారీగా ఉండడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు డ్రా కోసం ప్రయత్నిస్తున్నారు. తొలి టెస్ట్‌కు భిన్నంగా కాస్త నెమ్మదిగా ఆడుతున్నారు.

Ind vs Eng: విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్.. చెలరేగుతున్న ఆకాష్ దీప్..
Ind vs Eng, Second Test Match

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది (Ind vs Eng). చివరి రోజు భారత బౌలర్లు సంయమనంతో బౌలింగ్ చేస్తున్నారు. లక్ష్యం భారీగా ఉండడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు డ్రా కోసం ప్రయత్నిస్తున్నారు. తొలి టెస్ట్‌కు భిన్నంగా కాస్త నెమ్మదిగా ఆడుతున్నారు. అయితే టీమిండియా బౌలర్ ఆకాష్ దీప్ (Akash Deep) చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడు.


ఆకాష్ దీప్ (4/58) ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. శనివారమే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఐదో రోజు లంచ్ సమయానికి మరో మూడు వికెట్లు కోల్పోయింది. 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను జేమీ స్మిత్ (44 నాటౌట్), బెన్ స్టోక్స్ (33) ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే ఈ జోడీని వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. బెన్ స్టోక్స్‌ను ఆరో వికెట్‌గా పెవిలియన్ చేర్చాడు.


ప్రస్తుతం ఇంగ్లండ్ 44 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి మరో 442 పరుగులు అవసరం. ఈ లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇక, భారత్ విజయానికి నాలుగు వికెట్లు అవసరం. జేమీ స్మిత్ తప్పించి మిగిలన వాళ్లు బౌలర్లే కావడంతో టీమిండియా గెలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. వర్షం మరోసారి అంతరాయం కలిగించకుండా ఉంటే టీమిండియా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇవీ చదవండి:

మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ కోచ్

పంత్‌-గంభీర్ వీడియో వైరల్!

టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 08:02 PM