Share News

నాజూకైన వాళ్లే కావాలంటే మోడల్స్‌ను తెచ్చుకోండి!

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:20 AM

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శరీరాకృతినుద్దేశించి కాంగ్రెస్‌ మహిళా నేత షమా మహ్మద్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి...

నాజూకైన వాళ్లే కావాలంటే మోడల్స్‌ను తెచ్చుకోండి!

  • శరీరాకృతి కాదు..ఆట ముఖ్యం

  • రోహిత్‌కు గవాస్కర్‌ మద్దతు

దుబాయ్‌: కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శరీరాకృతినుద్దేశించి కాంగ్రెస్‌ మహిళా నేత షమా మహ్మద్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో హిట్‌మ్యాన్‌కు మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ మద్దతుగా నిలిచాడు. క్రికెట్‌లో మానసిక బలమే ప్రధానమన్నాడు. నాజూగ్గా ఉండేవాళ్లు కావాలనుకొంటే.. మోడలింగ్‌ పోటీలకు వెళ్లి..అక్కడినుంచి మోడల్స్‌ను తెచ్చుకోండి’ అని చురకలంటించాడు. ‘క్రికెట్‌లో రాణించడమే ముఖ్యం. మిగతావన్నీ తర్వాతే. గతంలో సర్ఫరాజ్‌ను కూడా ఇలాగే లావుగా ఉన్నాడని హేళన చేశారు. కానీ, అతడు టెస్ట్‌ మ్యాచ్‌లో 150+ స్కోరు చేశాడు. రెండు మూడు అర్ధ శతకాలు కూడా బాదాడు. ఇక సమస్య ఏముంది? క్రికెట్‌లో శరీరాకృతి ఎలా ఉందన్నది అనవసరం. మానసికంగా ఎంత బలంగా ఉన్నాడనేది ముఖ్యం. అలాగే సుదీర్ఘంగా క్రీజులో ఉండి పరుగులు చేయగలిగితే చాలు’ అని గవాస్కర్‌ చెప్పాడు. రోహిత్‌ ఊబకాయంపై షమా ఎక్స్‌లో చేసిన పోస్టు దుమారాన్ని రేపింది. కెప్టెన్సీ కూడా ఏమంత ఆకట్టుకోవడం లేదని విమర్శించింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో.. షమా ఆ పోస్టును తొలగించింది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2025 | 05:21 AM