‘టెస్ట్’లపట్ల నిబద్ధత ఉంటే.. దేశవాళీల్లో ఆడాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 05:57 AM
ఏ ఆటగాడైనా దేశవాళీ పోటీల్లో ఆడడం ద్వారా టెస్టు క్రికెట్‌పట్ల తమ నిబద్ధతను నిరూపించుకోవాలని భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ సూచించాడు. దేశవాళీలకు అత్యధిక ప్రాధాన్యమివ్వకపోతే టెస్టుల్లో నాణ్యమైన...

ఆటగాళ్లకు కోచ్ గంభీర్ సూచన
సిడ్నీ: ఏ ఆటగాడైనా దేశవాళీ పోటీల్లో ఆడడం ద్వారా టెస్టు క్రికెట్‌పట్ల తమ నిబద్ధతను నిరూపించుకోవాలని భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ సూచించాడు. దేశవాళీలకు అత్యధిక ప్రాధాన్యమివ్వకపోతే టెస్టుల్లో నాణ్యమైన ఆటగాళ్లను చూడలేమన్నాడు. ఇక ఫామ్‌లేమితో సతమతమవుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికీ తమ సత్తా నిరూపించుకోవాలన్న తపనతోనే ఉన్నారని చెప్పాడు. అదే సమయంలో భవిష్యత్‌లో భారత టెస్టు జట్టులో రోహిత్, కోహ్లీ స్థానాలకు గ్యారెంటీ మాత్రం గంభీర్ ఇవ్వకపోవడం గమనార్హం. పేలవ ఫామ్‌తో ఐదో టెస్టు నుంచి వైదొలగిన రోహిత్‌ను ప్రశంసించాడు.