ICC Test Team : ఐసీసీ టెస్ట్ డ్రీమ్ టీమ్‌లో..బుమ్రా, జడేజా, జైస్వాల్
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:16 AM
ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్- 2024లో ముగ్గురు భారత ఆటగాళ్లు బుమ్రా, జడేజా, యశస్వీ జైస్వాల్‌కు చోటు దక్కింది. ఆస్ట్రేలియా నుంచి కెప్టెన్‌గా కమిన్స్ ఒక్కడినే ఎంపిక చేయగా.. ఇంగ్లండ్ నుంచి నలుగురు, న్యూజిలాండ్ నుంచి

దుబాయ్: ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్- 2024లో ముగ్గురు భారత ఆటగాళ్లు బుమ్రా, జడేజా, యశస్వీ జైస్వాల్‌కు చోటు దక్కింది. ఆస్ట్రేలియా నుంచి కెప్టెన్‌గా కమిన్స్ ఒక్కడినే ఎంపిక చేయగా.. ఇంగ్లండ్ నుంచి నలుగురు, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, శ్రీలంక నుంచి ఒక్కరికి ఈ డ్రీమ్ టీమ్‌లో స్థానం లభించింది.
వన్డేల్లో మంధాన, దీప్తికి..: మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్- 2024లో భారత ప్లేయర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మలకు చోటు లభించింది. దక్షిణాఫ్రికా క్రీడాకారిణి లారా వోల్వార్ట్‌ను సారథిగా ఎంపిక చేశారు. ఇక పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ ఎంపిక అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ డ్రీమ్ టీమ్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. కానీ, ఉపఖండ జట్లు పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లే 10 స్థానాలు దక్కించుకోవడం విశేషం.