Share News

భారీగా పెరిగిన డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీ

ABN , Publish Date - May 16 , 2025 | 05:37 AM

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భారీగా పెంచింది. గత రెండు సీజన్ల వరకు ఇది కేవలం రూ.32.48 కోట్లు మాత్రమే ఉండగా...

భారీగా పెరిగిన డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీ

విజేతకు రూ.30.78 కోట్లు

భారత్‌ ఖాతాలో రూ.12.31 కోట్లు

దుబాయ్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భారీగా పెంచింది. గత రెండు సీజన్ల వరకు ఇది కేవలం రూ.32.48 కోట్లు మాత్రమే ఉండగా.. తాజా 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఈ మొత్తం రూ.49.27 కోట్లకు పెరగడం విశేషం. జూన్‌ 11 నుంచి లార్డ్స్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకు రూ.30.78 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. అదే గత రెండు పర్యాయాలు విజేతలకు రూ.13.67 కోట్ల చొప్పున మాత్రమే అందాయి. అలాగే ఈసారి రన్నర్‌పగా నిలిచిన జట్టుకే రూ.18.46 కోట్లు ఇవ్వనున్నారు. మూడో స్థానంలో నిలిచిన టీమిండియాకు రూ.12.31 కోట్లు దక్కుతాయి. అలాగే వరుసగా న్యూజిలాండ్‌కు రూ.10.26 కోట్లు, ఇంగ్లండ్‌కు రూ.8.2 కోట్లు, శ్రీలంకకు రూ.7.18 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.6.15 కోట్లు, వెస్టిండీ్‌సకు రూ.5.13 కోట్లు, పాకిస్థాన్‌కు రూ.4.10 కోట్లు అందనున్నాయి.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 05:37 AM