Ranji Trophy 2025: హైదరాబాద్ తడబాటు
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:43 AM
బౌలర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ కష్టాల్లో పడింది. గ్రూప్-డిలో జమ్మూ కశ్మీర్‌తో ఆదివారం ఆరంభమైన రంజీ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో...
తొలి ఇన్నింగ్స్‌లో 88/6
జమ్మూ కశ్మీర్ 170
జమ్మూ: బౌలర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ కష్టాల్లో పడింది. గ్రూప్-డిలో జమ్మూ కశ్మీర్‌తో ఆదివారం ఆరంభమైన రంజీ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 88/6 స్కోరు చేసింది. కెప్టెన్ రాహుల్ సింగ్ (48) రాణించాడు. తన్మయ్ (0), అభిరత్ (5), హిమతేజ (0), నితీశ్ (3), రాహుల్ రాధేష్ (7) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఆకిబ్ నబీ మూడు వికెట్లు పడగొట్టాడు. జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది. కార్తీకేయ, తనయ్ చెరో మూడు వికెట్లు దక్కించుకొన్నారు.
ఇవి కూడా చదవండి:
IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం
Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి