Share News

Ranji Trophy : హైదరాబాద్‌ 565 హిమాచల్‌ 33/1

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:21 AM

బ్యాటర్లు రాణించడంతో.. గ్రూప్‌-బిలో హిమాచల్‌తో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ భారీ స్కోరు చేసింది. ఆటకు రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్‌ స్కోరు 291/2తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ 565 పరుగులకు

Ranji Trophy : హైదరాబాద్‌ 565 హిమాచల్‌ 33/1

హైదరాబాద్‌: బ్యాటర్లు రాణించడంతో.. గ్రూప్‌-బిలో హిమాచల్‌తో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ భారీ స్కోరు చేసింది. ఆటకు రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్‌ స్కోరు 291/2తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ 565 పరుగులకు ఆలౌటైంది. తన్మయ్‌ అగర్వాల్‌ (177), హిమతేజ (76), నిషాంత్‌ (71) రాణించారు. ఆకాష్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన హిమాచల్‌ 33/1 స్కోరు చేసింది. శుభమ్‌ అరోరా (21), అంకిత్‌ (5) క్రీజులో ఉన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:21 AM