Ranji Trophy: ఓటమి దిశగా హైదరాబాద్
ABN , Publish Date - Nov 19 , 2025 | 04:53 AM
బ్యాటర్లు మరోసారి చేతులెత్తేయడంతో.. గ్రూప్-డిలో జమ్మూ కశ్మీర్‌తో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి బాటలో పయనిస్తోంది. ప్రత్యర్థి నిర్దేశించిన 472 పరుగుల లక్ష్య ఛేదనలో.. ఆటకు మూడో రోజు హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో...
లక్ష్యం 472.. ప్రస్తుతం 169/7
జమ్మూ రెండో ఇన్నింగ్స్ 422
జమ్మూ: బ్యాటర్లు మరోసారి చేతులెత్తేయడంతో.. గ్రూప్-డిలో జమ్మూ కశ్మీర్‌తో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి బాటలో పయనిస్తోంది. ప్రత్యర్థి నిర్దేశించిన 472 పరుగుల లక్ష్య ఛేదనలో.. ఆటకు మూడో రోజు హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 169/7తో కష్టాల్లో పడింది. మంగళవారం ఆట ముగిసే సమయానికి అనికేత్ (35 బ్యాటింగ్), రక్షణ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తన్మయ్ అగర్వాల్ (47), కెప్టెన్ రాహుల్ సింగ్ (30) చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించారు. ముస్తాక్ నాలుగు వికెట్లు, సాహిల్ లోథ్రా రెండు వికెట్లు దక్కించుకొన్నారు. ఆఖరి రోజు విజయానికి హైదరాబాద్‌కు 303 పరుగులు కావాల్సి ఉండగా.. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 275/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూ 422 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్ సమద్ (125), కన్హయ్య వాద్వాన్ (95) రాణించారు. తనయ్ నాలుగు, రక్షణ్ మూడు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూ 170, హైదరాబాద్ 121 పరుగులు చేశాయి.
ఇవి కూడా చదవండి:
IND VS BAN Women’s Series: భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై కీలక అప్ డేట్
NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి