Share News

Womens WorldCup: మహిళల వన్డే ప్రపంచకప్.. వేదికలు, తేదీలు ఇవే.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే

ABN , Publish Date - Jun 02 , 2025 | 07:22 PM

ఈ ఏడాది జరగాల్సిన మహిళల ప్రపంచకప్ కోసం సర్వం సన్నద్ధమైంది. భారత్, శ్రీలంక వేదికగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ మెగా టోర్నీ జరగబోతోంది. ఈ టోర్నీకి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా వెల్లడించింది.

Womens WorldCup: మహిళల వన్డే ప్రపంచకప్.. వేదికలు, తేదీలు ఇవే.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే
CC Women’s ODI World Cup 2025

ఈ ఏడాది జరగాల్సిన మహిళల ప్రపంచకప్ (Womens WorldCup) కోసం సర్వం సన్నద్ధమైంది. భారత్, శ్రీలంక వేదికగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ మెగా టోర్నీ జరగబోతోంది. ఈ టోర్నీకి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా వెల్లడించింది. ఈ ప్రపంచకప్ సెప్టెంబర్ 30వ తేదీన మొదలై నవంబర్ 2 వరకు జరగబోతోంది. ఈ టోర్నీ కోసం భారత్, శ్రీలంకల్లో ఐదు వేదికలను ఖరారు చేస్తూ ఐసీసీ ఓ ప్రకటన వెలువరించింది.


ఐసీసీ ఫైనల్ చేసిన వేదికల్లో విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం కూడా ఉంది. ఈ మెగా టోర్నీకి చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గువాహటి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ వీడీసీఏ స్టేడియం (విశాఖపట్నం), ప్రేమదాస స్టేడియం (కొలంబో) వేదికలుగా నిలవబోతున్నాయి. సెప్టెంబర్ 30న జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ బరిలోకి దిగబోతోంది. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.


మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్, ఎవరెవరు తలపడతారు అనే విషయంలో ఐసీసీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ పోటీపడబోతున్నాయి. అయితే పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగుతాయి. ఆ జట్టు భారత్ రావడం లేదు. పాక్ సెమీ ఫైనల్‌కు క్వాలిఫై అయితే దాని ఆధారంగా వేదికలను అప్పుడు నిర్ణయిస్తారు.


ఇవీ చదవండి:

ఆసీస్ రాక్షసుడి రిటైర్‌మెంట్

చాహల్ గర్ల్‌ఫ్రెండ్ సెలబ్రేషన్స్ వైరల్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 07:22 PM