Share News

హెచ్‌సీఏ కమిటీలను కొనసాగించాలి

ABN , Publish Date - Jun 06 , 2025 | 04:26 AM

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని ఏక సభ్య సంఘం నియమించిన సెలక్షన్‌ కమిటీలు, లీగ్‌ మ్యాచ్‌ల...

హెచ్‌సీఏ కమిటీలను కొనసాగించాలి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని ఏక సభ్య సంఘం నియమించిన సెలక్షన్‌ కమిటీలు, లీగ్‌ మ్యాచ్‌ల పర్యవేక్షణకు హైకోర్టు నియమించిన జస్టిస్‌ నవీన్‌రావు నేతృత్వంలోని సూపర్‌వైజరీ కమిటీని కొనసాగించాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)ను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది నుంచి హెచ్‌సీఏ ఏజీఎం నిర్వహించలేదని, ఏజీఎం లో నిర్ణయాలు తీసుకునే వరకు పాత సెలక్షన్‌ కమిటీలను కొనసాగించాలని జై హనుమాన్‌ క్రికెట్‌ క్లబ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు హెచ్‌సీఏ పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేసే వరకు ఈ కమిటీలు యథాతథంగా కొనసాగుతాయని మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరీ ఇంత దారుణమా.. అమ్మాయిలపై మగాళ్ల గుంపు దాడి..

చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ కీలక నిర్ణయం..

Updated Date - Jun 06 , 2025 | 04:26 AM