Share News

Hockey Final 2025: టైటిల్‌ పోరుకు హరియాణా జార్ఖండ్‌

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:33 AM

జాతీయ జూనియర్‌ మహిళల హాకీ టైటిల్‌ కోసం హరియాణా, జార్ఖండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి సెమీఫైనల్లో హరియాణా...

Hockey Final 2025: టైటిల్‌ పోరుకు హరియాణా జార్ఖండ్‌

జాతీయ జూ.మహిళల హాకీ

కాకినాడ : జాతీయ జూనియర్‌ మహిళల హాకీ టైటిల్‌ కోసం హరియాణా, జార్ఖండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి సెమీఫైనల్లో హరియాణా 3-0తో ఛత్తీ్‌సగఢ్‌పై విజయం సాధించింది. కెప్టెన్‌ శశి (8వ నిమిషం), సుప్రియ (45, 47 ని.) హరియాణా తరపున గోల్స్‌ చేశారు. రెండో సెమీ్‌సలో జార్ఖండ్‌ 3-0తో ఉత్తరప్రదేశ్‌ను ఓడించింది. స్వీటీ (13వ ని.), రీనా (56), కెప్టెన్‌ రజని (59) జార్ఖండ్‌కు గోల్స్‌ అందించారు. ఫైనల్‌ సోమవారం జరుగుతుంది. కాగా మూడో స్థానం కోసం ఛత్తీస్‌ గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ తలపడతాయి.

ఇవి కూడా చదవండి..

ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా? టీమిండియాకు ధ్రువ్ ఉంటే కలిసొస్తోందా..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 11 , 2025 | 05:33 AM