Share News

Harry Brook Says: నాకు కాదు రూట్‌కు ఇవ్వాల్సింది

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:05 AM

డ్రాగా ముగిసిన భారత్‌, ఇంగ్లండ్‌ టెస్టు సిరీ్‌సలో తనకు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కడంపై ఇంగ్లిష్‌ స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ స్పందించాడు. ఆ అవార్డుకు నిజమైన అర్హుడు జో రూట్‌ అని అన్నాడు...

Harry Brook Says: నాకు కాదు రూట్‌కు ఇవ్వాల్సింది

ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డుపై బ్రూక్‌

లండన్‌: డ్రాగా ముగిసిన భారత్‌, ఇంగ్లండ్‌ టెస్టు సిరీ్‌సలో తనకు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కడంపై ఇంగ్లిష్‌ స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ స్పందించాడు. ఆ అవార్డుకు నిజమైన అర్హుడు జో రూట్‌ అని అన్నాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు సంప్రదాయం ప్రకారం సదరు సిరీ్‌సలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ ఎవరికివ్వాలన్నది ఇరుజట్ల కోచ్‌లు నిర్ణయించాలి. దీంతో బ్రూక్‌ను టీమిండియా కోచ్‌ గంభీర్‌, గిల్‌ను ఇంగ్లండ్‌ కోచ్‌ మెకల్లమ్‌ ఎంపిక చేయడంతో ఇద్దరికి కలిపి అవార్డు ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఈ సిరీ్‌సలో రూట్‌ చేసినన్ని పరుగులు నేను చేయలేదు. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీ్‌సకు రూట్‌ అర్హుడు. అతనికే ఇవ్వాల్సింది’ అని బ్రూక్‌ తెలిపాడు. ఐదు మ్యాచ్‌ల ఆ టెస్టు సిరీ్‌సలో 9 ఇన్నింగ్స్‌ల్లో బ్రూక్‌ 53.44 సగటుతో 481 రన్స్‌ చేయగా.. రూట్‌ 67.12 సగటుతో 537 పరుగులు కొల్లగొట్టాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 07 , 2025 | 03:05 AM