Share News

Harmanpreets Hat Trick Powers: హర్మన్‌ హ్యాట్రిక్‌

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:33 AM

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ హ్యాట్రిక్‌తో మెరిసిన వేళ ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ బోణీ చేసింది..

Harmanpreets Hat Trick Powers: హర్మన్‌ హ్యాట్రిక్‌

రాజ్‌గిర్‌ (బిహార్‌) : కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ హ్యాట్రిక్‌తో మెరిసిన వేళ ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ బోణీ చేసింది. శుక్రవారం జరిగిన పూల్‌ ‘ఎ’ మ్యాచ్‌లో మనోళ్లు 4-3తో చైనాపై విజయం సాధించారు. ర్యాంకుల్లో మనకంటే ఎంతో తక్కువ స్థానంలో ఉన్న చైనాపై గెలిచేందుకు భారత్‌ చెమటోడ్చాల్సి రావడం గమనార్హం. హర్మన్‌ (20, 33, 47 ని.) మూడు గోల్స్‌ చేయగా..మరో గోల్‌ను జుగ్‌రాజ్‌ సింగ్‌ (18) కొట్టాడు. షిహావో (12), బెన్‌హల్‌ చెన్‌ (35), జీషెంగ్‌ (41) చైనాకు గోల్స్‌ అందించారు. పూల్‌ ‘ఎ’ ప్రారంభ మ్యాచ్‌లో జపాన్‌ 7-0తో కజకిస్థాన్‌ను చిత్తు చేసింది. భారత్‌-చైనా మ్యాచ్‌కు హాజరైన బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్‌ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. ఇక..ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో జపాన్‌ను భారత్‌ ఢీకొంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 03:33 AM