‘నార్వే చెస్’ బరిలో హంపి
ABN , Publish Date - Jan 16 , 2025 | 06:14 AM
తెలుగు గ్రాండ్‌మాస్టర్, వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నమెంట్‌లో పోటీపడనుంది. ప్రస్తుతం మహిళల...

స్టావెంజర్ (నార్వే): తెలుగు గ్రాండ్‌మాస్టర్, వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నమెంట్‌లో పోటీపడనుంది. ప్రస్తుతం మహిళల క్లాసికల్ చెస్‌లో ప్రపంచ ఆరో ర్యాంకులో ఉన్న హంపి తమ టోర్నీలో ఆడడం చాలా సంతోషంగా ఉందని నార్వే చెస్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ టోర్నీ ఈ ఏడాది మే నెలలో జరగనుంది.