ప్రపంచ అథ్లెటిక్స్‌కు గుల్వీర్ అర్హత
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:00 AM
దేశీయ స్టార్ అథ్లెట్ గుల్వీర్ సింగ్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పకు అర్హత సాధించాడు. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన ఇండోర్ ఈవెంట్ ఐదు వేల మీటర్ల రేసులో...

న్యూఢిల్లీ: దేశీయ స్టార్ అథ్లెట్ గుల్వీర్ సింగ్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పకు అర్హత సాధించాడు. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన ఇండోర్ ఈవెంట్ ఐదు వేల మీటర్ల రేసులో గుల్వీర్ 12 నిమిషాల 59.77 సెకన్లలో రేసును పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. 5000 మీ., రేసును 13 నిమిషాల లోపు పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్ గుల్వీరే. ఈ ప్రదర్శనతో తన పేరిట ఉన్న జాతీయ, ఆసియా రికార్డు (13 ని., 11.82 సెకన్లు)లను తానే తిరగరాసుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..