Share News

బరిలో గుకేష్‌, అర్జున్‌, హరికృష్ణ

ABN , Publish Date - Jan 17 , 2025 | 05:22 AM

భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేష్‌ ప్రపంచ చాంపియన్‌షి్‌ప దక్కించుకున్నాక తొలి టోర్నమెంట్‌కు సిద్ధమయ్యాడు. శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీ...

బరిలో గుకేష్‌, అర్జున్‌, హరికృష్ణ

టినుంచి టాటా చెస్‌

వికాన్‌ జీ (నెదర్లాండ్స్‌): భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేష్‌ ప్రపంచ చాంపియన్‌షి్‌ప దక్కించుకున్నాక తొలి టోర్నమెంట్‌కు సిద్ధమయ్యాడు. శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీ బరిలో దిగుతున్నాడు. గత డిసెంబరులో సింగపూర్‌లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో డింగ్‌ లిరెన్‌ను ఓడించి గుకేష్‌ విశ్వవిజేతగా నిలిచాడు. తదనంతరం న్యూయార్క్‌లో జరిగిన వరల్డ్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నమెంట్‌కు అతడు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక, టాటా స్టీల్‌ చెస్‌లో గుకే్‌షతోపాటు మాస్టర్స్‌ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్‌ ఇరిగేసి, ప్రజ్ఞానంద, హరికృష్ణ తలపడుతున్నారు. చాలెంజర్స్‌ విభాగంలో గ్రాండ్‌మాస్టర్లు విభాగంలో వైశాలీ, దివ్యా దేశ్‌ముఖ్‌ పోటీలో ఉన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 05:22 AM