Share News

బాక్సింగ్‌కు మనోజ్‌ గుడ్‌బై

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:05 AM

కామన్వెల్త్‌ మాజీ చాంపియన్‌, హరియాణా బాక్సర్‌ మనోజ్‌ కుమార్‌ (39) కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. పురుషుల 64 కిలోల విభాగంలో మనోజ్‌ కొన్నేళ్లపాటు...

బాక్సింగ్‌కు మనోజ్‌ గుడ్‌బై

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ మాజీ చాంపియన్‌, హరియాణా బాక్సర్‌ మనోజ్‌ కుమార్‌ (39) కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. పురుషుల 64 కిలోల విభాగంలో మనోజ్‌ కొన్నేళ్లపాటు ఆధిపత్యం ప్రదర్శించాడు. కోచ్‌గా కొత్త కెరీర్‌ ఆరంభిస్తానని అతడు తెలిపాడు. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన మనోజ్‌.. 2018 గోల్డ్‌ కోస్ట్‌ క్రీడల్లో చివరిసారిగా కాంస్యం సాధించాడు. 2012 లండన్‌, 2016 రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరాడు. గాయాలు, జాతీయ సమాఖ్యతో విభేదాల కారణంగా కెరీర్‌ ఆటంకాల నడుమ సాగింది.

Updated Date - Jan 31 , 2025 | 03:05 AM