మిక్స్‌డ్ రిలేలో పసిడి
ABN , Publish Date - May 29 , 2025 | 03:31 AM
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారులు వరుసగా రెండోరోజూ సత్తా చాటారు. బుధవారం జరిగిన పోటీల్లో ఓ స్వర్ణం సహా ఆరు పతకాలు కొల్లగొట్టారు. 4గీ400 మీటర్ల మిక్స్‌డ్ రిలే టీమ్...
రెండోరోజు భారత్‌కు ఆరు పతకాలు
ఆసియా అథ్లెటిక్స్
గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారులు వరుసగా రెండోరోజూ సత్తా చాటారు. బుధవారం జరిగిన పోటీల్లో ఓ స్వర్ణం సహా ఆరు పతకాలు కొల్లగొట్టారు. 4గీ400 మీటర్ల మిక్స్‌డ్ రిలే టీమ్ ఈవెంట్‌లో రూపల్ చౌదరి, సంతోష్ కుమార్, విశాల్, సుభా వెంకటేశన్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో విజేతగా నిలిచి టైటిల్ నిలబెట్టుకుంది. భారత బృందం 3:18.12 సెకన్లలో రేసు ముగించి పసిడి పతకం దక్కించుకుంది. కాగా.. చైనా (3:20.52 సె), శ్రీలంక (3:21.95 సె) జట్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజతం, కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి. ఇక, స్వర్ణం నెగ్గిన భారత మిక్స్‌డ్ టీమ్‌లో సభ్యురాలైన రూపల్ చౌదరి వ్యక్తిగత 400 మీటర్ల రేసులో రజతం అందుకుంది. డెకాథ్లాన్‌లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ 7618 పాయింట్లు స్కోరు చేసి రజతం నెగ్గాడు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్, మహిళల 1500 మీటర్ల రేసులో పూజ రజత పతకాలు సాధించారు. పురుషుల 1500 మీటర్ల రేసులో యూనస్ షా కాంస్యం దక్కించుకున్నాడు.
రెండోరోజు పోటీలు ముగిసేసరికి భారత్ మొత్తం 8 పతకాలతో ఉంది. మంగళవారం గుల్వీర్ సింగ్ (10వేల మీటర్లు) స్వర్ణం, సెబాస్టియన్ (20 కి.మీ రేస్‌వాక్) కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. ఇక తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి 110 మీటర్ల హర్డిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. తన హీట్స్‌లో జ్యోతి మూడోస్థానంలో నిలిచి ఫైనల్ రేసుకు అర్హత సాధించింది. మరో తెలుగు అథ్లెట్ రజిత కుంజ జట్టు సభ్యులతో కలిసి మహిళల 4గీ400 మీటర్ల రిలే ఈవెంట్‌లో ఫైనల్ చేరింది.
ఇవీ చదవండి:
హీరోలను మించిన లుక్‌లో రాహుల్!
కోహ్లీతో మైండ్‌గేమ్స్.. ఎవడ్రా వీడు!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి