జిమ్నాస్ట్ నిషికకు స్వర్ణం
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:11 AM
తెలంగాణ జిమ్నాస్ట్ నిషిక అగర్వాల్ జాతీయ క్రీడల్లో సంచలనం సృష్టించింది. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టేబుల్ వాల్ట్ పోటీల్లో టోక్యో ఒలింపియన్ ప్రణతి నాయక్ (ఒడిశా)ను...

నిఖిల్ కాంస్య పట్టు 8 జాతీయ క్రీడలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ జిమ్నాస్ట్ నిషిక అగర్వాల్ జాతీయ క్రీడల్లో సంచలనం సృష్టించింది. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టేబుల్ వాల్ట్ పోటీల్లో టోక్యో ఒలింపియన్ ప్రణతి నాయక్ (ఒడిశా)ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. డెహ్రాడూన్‌లో బుధవారం జరిగిన ఈ పోటీల్లో నిషిక 12.717 స్కోరుతో విజేతగా నిలిచింది. ప్రణతి (12.700) రజతం అందుకుంది. రెజ్లింగ్‌లో హైదరాబాదీ నిఖిల్ యాదవ్ కంచు పట్టు పట్టాడు. 65 కిలోల కాంస్య పతక పోరులో నిఖిల్ 12-2తో మహేష్ (కర్ణాటక)పై గెలిచి కాంస్యం నెగ్గాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..