Share News

గిల్‌ సూపర్‌

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:23 AM

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్‌.. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112) సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం ఏకపక్షంగా సాగిన...

గిల్‌ సూపర్‌

గిల్‌ సూపర్‌

శతకంతో సత్తాచాటిన ఓపెనర్‌

  • రాణించిన కోహ్లీ, అయ్యర్‌

  • 142 పరుగులతో విజయం

  • మూడో వన్డేలోనూ ఇంగ్లండ్‌ చిత్తు

  • 3-0తో సిరీస్‌ భారత్‌ వశం

అహ్మదాబాద్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్‌.. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112) సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం ఏకపక్షంగా సాగిన మూడో, ఆఖరి వన్డేలో భారత్‌ 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తొలుత భారత్‌ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ (55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), శ్రేయాస్‌ అయ్యర్‌ (64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78), రాహుల్‌ (40) రాణించారు. రషీద్‌ నాలుగు, మార్క్‌ ఉడ్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఇంగ్లండ్‌ 34.2 ఓవర్లలో 214 పరుగులకు కుప్పకూలింది. అట్కిన్సన్‌ (38), బాంటన్‌ (38) టాప్‌ స్కోరర్లు. అక్షర్‌, అర్ష్‌దీప్‌, హర్షిత్‌, హార్దిక్‌ తలో 2 వికెట్లు దక్కించుకొన్నారు. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు రోహిత్‌, కోహ్లీ టచ్‌లోకి రాగా.. తన ఎంపికను ప్రశ్నిస్తున్న వారికి గిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌స’తో సమాధానమిచ్చాడు.


పోరాటమే లేకుండా..: భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు సాల్ట్‌ (23), డకెట్‌ (34) దూకుడైన ఆరంభాన్నిచ్చినా.. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. ఈ దశలో బాంటమ్‌కి జతకలసిన రూట్‌ (24) జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. దీంతో 15వ ఓవర్లో ఇంగ్లండ్‌ వంద పరుగులు దాటింది. అయితే, సిక్స్‌తో గేర్‌ మార్చే ప్రయత్నం చేస్తున్న బాంటన్‌ను కుల్దీప్‌ బోల్తాకొట్టించాడు. 21వ ఓవర్‌లో రూట్‌ను అక్షర్‌ బౌల్డ్‌ చేయడంతో.. ఇంగ్లండ్‌ 136/4తో కష్టాల్లో పడింది. బట్లర్‌ (6), బ్రూక్‌ (19)ను హర్షిత్‌ పెవిలియన్‌ చేర్చడంతో.. మ్యాచ్‌ భారత్‌వైపు మొగ్గింది. అట్కిన్సన్‌ కొంత ప్రతిఘటించినా.. లివింగ్‌స్టోన్‌ (9), రషీద్‌ (0), ఉడ్‌ (9) అలా వచ్చి ఇలా వెళ్లారు.

బ్యాటర్లు భళా..: ఓపెనర్‌ గిల్‌ సూపర్‌ సెంచరీతో భారీ స్కోరుకు బాటలు వేయగా.. ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీతో టచ్‌లోకి రావడం అభిమానులకు ఊరటనిచ్చింది. ఇక, జోరుమీదున్న అయ్యర్‌ అదే తరహా దూకుడును ప్రదర్శించడంతో.. టీమిండియా సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. కోహ్లీతో కలసి రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించిన గిల్‌.. అయ్యర్‌తో కలసి మూడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టిదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో శతకంతో జోరుమీదున్న రోహిత్‌ (1)ను ఉడ్‌ క్యాచవుట్‌ చేశాడు. అయితే, గిల్‌ మాత్రం ఆరంభం నుంచే చక్కని స్ట్రోక్‌ ప్లేతో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. మరోవైపు క్రీజులో కుదురుకొనేందుకు కొంత సమయం తీసుకొన్న విరాట్‌ ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పడంతో తొలి పవర్‌ప్లే ముగిసే సరికి భారత్‌ 52/1తో నిలిచింది. 17వ ఓవర్‌లో ఫోర్‌ కొట్టిన గిల్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. జట్టు స్కోరు సెంచరీ మార్క్‌ దాటింది. ఆ తర్వాతి ఓవర్‌లో లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన విరాట్‌.. సింగిల్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. అయితే, కోహ్లీని అద్భుతమైన బంతితో క్యాచవుట్‌ చేసిన రషీద్‌ జట్టుకు కావాల్సిన బ్రేక్‌ అందించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అయ్యర్‌ కూడా ధాటిగా ఆడడంతో రన్‌రేట్‌ ఎక్కడా తగ్గలేదు. దీంతో సగం ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 161/2తో పటిష్టంగా కనిపించింది.


క్రమంగా 90ల్లోకి అడుగుపెట్టిన గిల్‌.. ఉడ్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో శతకం పూర్తి చేసుకొన్నాడు. అయితే, రషీద్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడే క్రమంలో బౌల్డ్‌ అయ్యాడు. ఆ సమయానికి భారత్‌ స్కోరు 35 ఓవర్లలో 228/3. ఇక రషీద్‌ బౌలింగ్‌లో లెగ్‌ సైడ్‌ పడిన బంతిని ఆడే క్రమంలో అయ్యర్‌ అనవసరంగా వికెట్‌ పారేసుకోవడంతో.. చివరి 10 ఓవర్లలో భారత్‌ ఆశించినంత వేగంగా స్కోరు చేయలేక పోయింది. రాహుల్‌ను మహమూద్‌, హార్దిక్‌ (17)ను రషీద్‌ అవుట్‌ చేశారు. అక్షర్‌ పటేల్‌ (13), సుందర్‌ (14), హర్షిత్‌ (13) భారీ షాట్లు ఆడే క్రమంలో పెవిలియన్‌ చేరారు.

స్కోరు బోర్డు

భారత్‌: రోహిత్‌ (సి) సాల్ట్‌ (బి) ఉడ్‌ 1, గిల్‌ (బి) రషీద్‌ 112, కోహ్లీ (సి) సాల్ట్‌ (బి) రషీద్‌ 52, అయ్యర్‌ (సి) సాల్ట్‌ (బి) రషీద్‌ 78, రాహుల్‌ (ఎల్బీ) మహమూద్‌ 40, హార్దిక్‌ (బి) రషీద్‌ 17, అక్షర్‌ (సి) బాంటన్‌ (బి) రూట్‌ 13, సుందర్‌ (సి) బ్రూక్‌ (బి) ఉడ్‌ 14, హర్షిత్‌ (సి) బట్లర్‌ (బి) అట్కిన్సన్‌ 13, అర్ష్‌దీప్‌ (రనౌట్‌) 2, కుల్దీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 50 ఓవర్లలో 356 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-6, 2-122, 3-226, 4-259, 5-289, 6-307, 7-333, 8-353, 9-353, 10-356; బౌలింగ్‌: మహమూద్‌ 10-0-68-1, ఉడ్‌ 9-1-45-2, అట్కిన్సన్‌ 8-0-74-1, రూట్‌ 5-0-47-1, రషీద్‌ 10-0-64-4, లివింగ్‌స్టోన్‌ 8-0-57-0.


ఇంగ్లండ్‌: సాల్ట్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్‌దీప్‌ 23, డకెట్‌ (సి) రోహిత్‌ (బి) అర్ష్‌దీప్‌ 34, బాంటన్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 38, రూట్‌ (బి) అక్షర్‌ 24, బ్రూక్‌ (బి) హర్షిత్‌ 19, బట్లర్‌ (బి) హర్షిత్‌ 6, లివింగ్‌స్టోన్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) సుందర్‌ 9, అట్కిన్సన్‌ (బి) అక్షర్‌ 38, రషీద్‌ (బి) హార్దిక్‌ 0, మార్క్‌ ఉడ్‌ (సి) అయ్యర్‌ (బి) హార్దిక్‌ 9, మహమూద్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 34.2 ఓవర్లలో 214 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-60, 2-80, 3-126, 4-134, 5-154, 6-161, 7-174, 8-175, 9-193. బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 5-0-33-2, హర్షిత్‌ రాణా 5-1-31-2, సుందర్‌ 5-0-43-1, అక్షర్‌ 6.2-1-22-2, హార్దిక్‌ 5-0-38-2, కుల్దీప్‌ 8-0-38-1.


1

ఒకే వేదికపై మూడు ఫార్మాట్లలోనూ శతకం బాదిన తొలి భారత ఆటగాడిగా గిల్‌. గతంలో ఇక్కడ టెస్టులు, టీ20ల్లోనూ గిల్‌ సెంచరీ చేశాడు.

1

వేగంగా 2500 పరుగుల మార్క్‌ చేరుకొన్న తొలి ప్లేయర్‌గా శుభ్‌మన్‌. 50 ఇన్నింగ్స్‌లోనే గిల్‌ ఈ ఫీట్‌ సాధించాడు. హషీమ్‌ ఆమ్లా (51), ఇమాముల్‌ హక్‌ (52), వివ్‌ రిచర్డ్స్‌ (56) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

2

పరుగుల పరంగా వన్డేల్లో ఇంగ్లండ్‌పై భారత్‌కిది రెండో అతిపెద్ద (142 రన్స్‌) విజయం. 2008లో రాజ్‌కోట్‌ వేదికగా 158 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్‌ ఓడించింది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2025 | 05:23 AM