Gautam Gambhirs Emotional: కన్నీళ్లు.. గంతులు.. ఆలింగనాలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 02:03 AM
టీమిండియా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ సీరియ్‌సగా కనిపిస్తుంటాడు.. విజయాలు దక్కిన సందర్భాల్లోనూ
లండన్: టీమిండియా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ సీరియ్‌సగా కనిపిస్తుంటాడు.. విజయాలు దక్కిన సందర్భాల్లోనూ అతను పెద్దగా సంబరాలు చేసుకోవడాన్ని కూడా అభిమానులు చూసి ఉండరు. కానీ, సోమవారం ఓవల్ టెస్టులో భారత జట్టు గెలిచిన క్షణాన మాత్రం గంభీర్ సెలబ్రేట్ చేసుకున్న తీరు ఎంతో ఉద్విగ్నభరితమని చెప్పొచ్చు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే గౌతీ.. భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశాడు. సంబరం పట్టలేక చిన్నపిల్లాడిలా ఎగిరి గంతులేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌ను హత్తుకొని ఆప్యాయంగా ముద్దాడాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన గంభీర్.. గట్టిగా అరుస్తూ జట్టు విజయాన్ని తనివితీరా ఆస్వాదించాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో అత్యంత ఉద్వేగభరితంగా మారిన ఆ అపురూప క్షణాల వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు.. ‘నిజంగా ఈ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. కోచ్‌కు, జట్టుకు అభినందనలు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.