Gambhir Press Conference: మరో ఆటగాడిని అనుమతించాలి
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:49 AM
మ్యాచ్ సందర్భంగా క్రికెటర్ తలకు గాయమైతే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అతడి స్థానంలో మరో ప్లేయర్‌ను అనుమతిస్తుంటారు. అలా వచ్చే ఆటగాడికి బ్యాటింగ్, బౌలింగ్ చేసే...
గాయాలపై కోచ్ గంభీర్
మాంచెస్టర్: మ్యాచ్ సందర్భంగా క్రికెటర్ తలకు గాయమైతే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అతడి స్థానంలో మరో ప్లేయర్‌ను అనుమతిస్తుంటారు. అలా వచ్చే ఆటగాడికి బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే తల కాకుండా ఇతర శరీర భాగాలకు గాయాలైతే ఈ వెసులుబాటు లేదు. ఇదే విషయమై భారత జట్టు కోచ్ గంభీర్ స్పందించాడు. ‘ఓ ఆటగాడి గాయం తీవ్రతను రెఫరీ, అంపైర్ పరిశీలించాక సబ్‌స్టిట్యూట్‌ను ఆడించడంపై నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. ప్రత్యర్థి 11 మంది ఆటగాళ్లతో ఆడుతుంటే మేం పది మందితో ఎలా పోరాడగలం?’ అని గంభీర్ ప్రశ్నించాడు.
ఇవి కూడా చదవండి..
ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..